Saturday, 1 November 2014

మేరీ జోన్స్ మరియు బైబిలు


ప్రియ స్నేహిత, బాగున్నావా..!! చాలాసార్లు మన జీవితంలో ఏమి చేయగలం అనుకుంటాము కదా... ఇంకా మన స్వార్ధం కోసం దేవుని పక్కన పెట్టి మనకి ఇష్టం వచ్చిన పనులు చేస్తాము కదా... అయితే, దేవుణ్ణి మరియు అయన వాక్యాన్ని ప్రేమించటం ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని రాగలమో అర్దంకావాలంటే  మేరీ జోన్స్ జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకోవాల్సిందే .... ఇంకేమి జాగ్రతగా నిజంగా జరిగిన ఈ కథని చదవండి.

వేల్స్ నగరం లో డిసెంబర్ నెలలో మేరీ జోన్స్ జన్మించింది. ఈమె నాన్న గారు ఒక వస్త్రములు కుట్టుకునే పేదవాడు. మేరీ వాళ్ళ కుటుంబం ఒక కొండ ప్రాంతలో నివసించే వారు. మరియు వీరిది నిత్యుడగు దేవుని యందు బయభక్తులు కలిగిన కుటుంబం కావటం చేత మేరీ తన ఎనిమిదవ ఏట నే దేవునిని  తెలుసుకున్నది. మేరీ వాళ్ళ గ్రామంలో స్కూల్ ఒకటి పెడుతున్నారని చాలా సంతోషించింది. ఎంతో ఆసక్తితో చదవటం మరియు రాయటం నేర్చుకుంది. ఇకనుండి తప్పకుండ తనకు ఎంతో ఇష్టమయిన  బైబిలు ను చదవగలను అనుకుంది. 
 వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి బైబిలు కావాలి అని అడిగింది. అయితే అ రోజుల్లో బైబిలు అందరి దగ్గర వుండేది కాదు. చాలా గొప్ప ధనవంతుల దగ్గరే బైబిలు వుండేది. కాబట్టి మేరీ కోరికను వాళ్ళ అమ్మ తీర్చలేకపోయింది. అయితే మేరీ తనకు వున్నా ఆసక్తిని బట్టి వాళ్ళ ఇంటిదగ్గనుండి దాదాపు నాలుగు కిలోమీటర్ ల దూరం వున్నా ఒక ప్రదేశానికి వెళ్లి అక్కడ బైబిల్ చదువుకుంటూ వుండేది. అయినప్పటికీ తనకు ఒక సొంత బైబిలు ఉండాలనే కోరిక మాత్రం అనుదినం పెరిగిపోయింది. కానీ తన కోరిక నెరవేరే మార్గం ఏమి కనిపించలేదు. బైబిలును కొనే స్తోమత లేదు ఒకవేళ డబ్బులు సమకూరిన బైబిల్ కొనాలంటే అక్కడ నుండి 50 కిలోమీటర్లు దూరంలో వున్న పట్టణానికి వెళ్లి కొనుక్కోవాలి. అయినా మేరీ ఏ మాత్రం చింతపడకుండా ఎలాగయినా బైబిలు కొనటానికి కావలసిన డబ్బులు సంపాదించాలని ఆ చిన్న వయసులోనే అనుకుంది. దానికోసం మేరీ కోళ్ళను పెంచటం, తోట పని చేయటం మొదలుపెట్టింది. 
సంపాదించిన కొంచెం డబ్బును జాగ్రతగా దాచిపెట్టినది. ఇలా ఆరు సంవత్సరాలు డబ్బును దాచిపెట్టినది. బైబిలు కొనటానికి సరిపడా డబ్బులు మేరీ కి సమకూరినాయి కానీ మేరీ కి బైబిలు అమ్మేవారు అ ఊరిలో ఎవరు కనిపించలేదు. బైబిలు కొనాలంటే 50 కిలోమీటర్లు నడచి వెళ్ళాలి అయినా సరే మేరీ వెనుదీయకుండా అంతదూరం కాలినడకతో ఒక్కటే వెళ్ళింది. అక్కడకు వెళ్లి ఎంతో సంతోషంతో రెవరెండ్ చార్లెస్ గారిని కలిసి తనకు ఒక బైబిలు కావాలని అడిగింది. అయితే చార్లెస్ గారు తనదగ్గర కేవలం ఒకే బైబిలు ఉంది, అదికూడా వేరే వాళ్ళకు అమ్ముతాను అని మాట ఇచ్చాను అని చెప్పేసరికి మేరీ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఇంకా అ పట్టణం లో ఎక్కడా బైబిలు కొనటానికి దొరకదు. ఇన్ని సంవత్సరాల తన శ్రమ వృధా అవుతుందా అని దిగులు పడింది. 
 బైబిలు కోసం మేరీ పడుతున్న తాపత్రయాన్ని, ఆమె కష్టాన్ని  గమనించిన చార్లెస్ గారు తన దగ్గరున్న ఒకే బైబిలును మేరీ కి ఇచ్చేసారు. అప్పటికి మేరీ వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే .
            అటు పిమ్మట చార్లెస్ గారు బ్రిటన్ కి వెళ్లి మేరీ చేసిన పని కోసం బాగా ఆలోచించారు. మేరీ లాంటి వాళ్ళు బైబిలు కోసం ఇంత కష్టపడుతున్నారు. ప్రతిఒక్కరికి బైబిలు అందుబాటులోనికి రావాలి అని 1804 లో British and Foreign Bibles Society ని స్థాపించి బైబిల్ పంపిణి ని  ప్రారంబించారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బైబిలు ని ఈ సొసైటీ నే సరఫరా చేస్తుంది. బైబిలు సొసైటీ అఫ్ ఇండియా బెంగుళూరు లో వున్నది.
మేరీ 1864 లో మరణించారు. ఆమె వాడిన బైబిలు ఇప్పటికీ Cambridge University Library లో బద్రపరచబడి వున్నది. 
 చూసారా మిత్రులారా, చిన్న పాప అయినా కానీ మేరీ దేవుని వాక్యాన్ని ప్రేమించటం వలన ఒక బైబిలు సొసైటీ ని ప్రారంబించటానికి కారణం అయింది. మరి నువ్వు ఈ రోజు నీ చేతిలో బైబిలు కలిగి వున్నావు కానీ అ బైబిలును ఎపుదయినా చదివావా? మరి ఇక ఈ రోజు నుండి అయినా ప్రతి దినము తప్పకుండా బైబిలు చదువుతాను అని ఒక మంచి నిర్ణయం చేసుకుందామా..!!

దేవుడు నిన్ను దీవించును గాక...!!                                                                 

                                                                                                            - (సేకరణ: SP)

3 comments: